![]() |
![]() |

ఈ సమాజంలో భార్యాభర్తల మధ్య సాధారణంగా చిన్న చిన్న గొడవలు వస్తాయి. అవి సహజం. అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదైన గేమ్ ఆడినప్పుడు అందులో భర్త గెలవకపోతే..భార్యే గెలిస్తే అతని భాద వర్ణనాతీతం. ఇప్పుడు అదే జరిగింది. జోర్దార్ సుజాత అతని భర్త రాకింగ్ రాకేశ్ కలిసి ఓ గేమ్ ఆడారు. దానిని వ్లాగ్ గా చేసి చంటబ్బాయ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు.
జోర్దార్ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్ మార్కెటింగ్ జాబ్‌లో చేరింది. ఈ క్రమంలో తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్ లో అవకాశం ఉంది అనడంతో తన అదృష్టం వెతుకుంటూ వెళ్లగా అక్కడ ఆమెకు అవకాశం దక్కింది. అలా తీన్మార్ వార్తలు కార్యక్రమంలో సుజాతగా పరిచయమయ్యింది. ఆమె ఆ తరువాత జోర్దార్ వార్తలతో 'జోర్దార్ సుజాత' గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ఆమె బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్ "సూపర్ సుజాత" ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. సుజాత జబర్దస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది. అంతేకాదు ఆమె, రాకేష్ పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి మార్కులు కొట్టేసింది సుజాత.
రాకేశ్ జబర్దస్త్ లో చిన్నపిల్లలతో స్కిట్ చేపిస్తూ ఫేమస్ అయ్యాడు. ఇక వీరిద్దరు పెళ్లి తర్వాత చంటబ్బాయ్, సూపర్ సుజాత అనే యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా రకరకాల వ్లాగ్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. ఇక తాజాగా ' పెళ్ళి అయిన ఇన్ని రోజులకి ఇలా అయింది ' అనే వ్లాగ్ ని చంటబ్బాయ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు రాకేశ్. ఇందులో మొదటగా వారి కూతురు నక్షత్ర మాట్లాడింది. తను ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది కాబట్టి మీకు అర్థం కాకపోతే ఏం అనుకోకండి అని రాకేశ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రాకేశ్, సుజాత కలిసి ట్యాబ్ లో 'లూడో' గేమ్ ఆడారు. ఇద్దరు కలిసి ఛాలెంజ్ చేసుకున్నారు. ఇక అన్నీ గేమ్ లలో సుజాతనే గెలిచింది. ఇక గెలిచిన తర్వాత తనేం చెప్తే అది చేయాలని సుజాత అనగానే సరేనని రాకేశ్ అన్నాడు. " మీరు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారు. తినేటప్పుడు, నక్షత్రతో ఆడుకుంటున్నప్పుడు, పడుకునే ముందు.. ఇలా ఇంట్లో ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్నారు. మీరు ఇక ఇంట్లో మొబైల్ వాడటం మానేయాలి " అని సుజాత అనగానే.. సరేనని రాకేశ్ అన్నాడు. ఇక సుజాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక వ్లాగ్ చివరన రాకేశ్ కి ఫోన్ రావడంతో ఫోన్ కోసం పరుగున వెళ్లాడు. ఇప్పుడే కదా ఫోన్ వాడనని చెప్పాడు అప్పుడే మళ్లీ వెళ్ళాడని సుజాత ఫీల్ అయింది.
![]() |
![]() |